Gandhi Tatha Chettu Trailer: సుకుమార్ కూతురి సినిమాట్రైలర్.. లాంచ్ చేసిన మహేష్ బాబు..! 10 h ago
స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు ట్రైలర్ విడుదలయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు డిజిటల్ గా ఈ ట్రైలర్ ను లాంచ్ చేశారు. పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సుకుమార్ భార్య తబితా సమర్పించారు. మైత్రి మూవీ మేకర్స్, గోపి టాకీస్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి ఇప్పటికే దేశ విదేశాల్లో ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. జనవరి 24న ఈ మూవీ రిలీజ్ కానుంది.